తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవే

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరగడంతో, హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,670కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,610కి చేరింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు అమలవుతున్నాయి. కొనుగోలుదారులు జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.