హైదరాబాద్ వాసులకు భారీ ఊరట: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు రద్దు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,090 కోట్లతో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వందలాది చెట్ల నరికివేతను నివారించాలనే డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పార్క్ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయకుండా ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.