ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగింపు: తెరవెనుక నగదు మరియు మద్యం పంపిణీ జోరు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: గరివిడి

గరివిడి మండలంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదు, మద్యం పంపిణీకి తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక్కో ప్రాదేశికానికి భారీగా ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు సిద్ధమయ్యారు. ఓటుకు వెయ్యి రూపాయల వరకు ఇస్తూ, వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు భరిస్తామని హామీలిస్తూ ప్రలోభాలకు తెరలేపారని రాజకీయ వర్గాల్ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.