రాష్ట్రంలో అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ కీలక ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

అమరావతి రాజధాని పరిధిలో గ్రామకంఠం మినహాయింపులపై ఏపీ సీఆర్డీఏ స్పష్టతనిచ్చిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ ఎనిమిదో తేదీ రెండు వేల పద్నాలుగును కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములు, రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్లాట్లను నిబంధనల ప్రకారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. గ్రామ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న ఖాళీ వ్యవసాయ భూములకు మినహాయింపు వర్తించదని సీఆర్డీఏ స్పష్టం చేసింది.