మత విశ్వాసాల వివాదంపై సారా అలీ ఖాన్‌కు సోనియా బన్సాల్ మద్దతు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ముంబై
కేదార్నాథ్ ఆలయ సందర్శన నేపథ్యంలో నటి సారా అలీ ఖాన్‌పై వస్తున్న విమర్శలను బిగ్‌బాస్ ఫేమ్ సోనియా బన్సాల్ తీవ్రంగా ఖండించారు. మత విశ్వాసాల కంటే మానవత్వం, ప్రేమ అందరికీ అత్యంత ముఖ్యమని ఆమె IANS ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎవరి ప్రార్థనలను వివాదం చేయడం సరికాదని, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని సోనియా బన్సాల్ స్పష్టం చేశారు.