టెక్నాలజీ అద్భుతం: కృత్రిమ మేధ సహాయంతో పోగొట్టుకున్న ఇయర్బడ్ వెతికిపట్టుకున్న వ్యక్తి

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

పోగొట్టుకున్న ఇయర్బడ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ సహాయంతో వెతికిపట్టుకున్నట్లు ఓ వ్యక్తి రెడ్డెట్లో పంచుకున్నారని టెక్ నిపుణులు తెలిపారు. పార్కులో తన కుమారుడి కోసం పరిగెత్తుతుండగా జారిపడిన ఇయర్బడ్ రాళ్ల మధ్య కనిపించకుండా పోయిందని ఆయన వివరించారు. పది నిమిషాల పాటు వెతికినా దొరకకపోవడంతో ఛాట్బాట్కు ఫోటోలు అప్లోడ్ చేయగా, అది క్షణాల్లో ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించి ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఈ సంఘటనపై నెటిజన్లు పెద్దఎత్తున చర్చించుకుంటూ ఏఐ ఇమేజ్ రికగ్నిషన్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నారని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.