నాగావళి ఉగ్రరూపం: విజయనగరం జిల్లాలో జలదిగ్బంధంలో పలు గ్రామాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

అర్నబ్ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు మరియు నదుల వరద ఉద్ధృతి కారణంగా వంగర మండలం కొప్పర గ్రామం సహా పదుల సంఖ్యలో ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. నాగావళి, సువర్ణముఖి నదులు పొంగిపారడంతో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, ప్రమాద జోన్ లో ఉన్న చెరువులపై అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.