కిశోర్ కుమార్ జీవిత చరిత్ర జాతీయ అవార్డుపై పాట్నా హైకోర్టులో పిటిషన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పాట్నా
దిగ్గజ గాయకుడు కిశోర్ కుమార్ జీవిత చరిత్ర పుస్తకానికి లభించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డును సవాల్ చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రముఖ రచయితలు అనిరుద్ధ భట్టాచార్య, పార్థివ్ ధర్ సంయుక్తంగా రచించిన కిశోర్ కుమార్ ది అల్టిమేట్ బయోగ్రఫీ పుస్తకానికి ఉత్తమ సినిమా పుస్తక పురస్కారం దక్కింది. అయితే నిబంధనలు పాటించకుండానే ఈ అవార్డును ఎంపిక చేశారంటూ హిందీ రచయిత అనంత ప్రసాద్ సిన్హా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అజిత్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది.