పాలకొల్లులో పర్యావరణ హితంగా 65 అడుగుల మట్టి గణపతి!

రిపోర్టర్: కృష్ణ స్థలం: పశ్చిమ గోదావరి

పాలకొల్లు మావుళ్ళమ్మ పేట రెల్లి వీధిలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న 65 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ శిల్పి ఇంటి ప్రసాద్ నేతృత్వంలో పూర్తిగా మట్టితో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పీఓపీకి దూరంగా ఏర్పాటు చేస్తున్న ఈ వినాయకుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, ఈ నెల 14 నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.