దిల్లీలో ఘరానా మోసం: తాంత్రికుడిగా నమ్కించి ముప్పై తొమ్మిది లక్షలు కొల్లగొట్టిన నిందితులు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

దిల్లీలో భూగర్భ నిధి చూపిస్తామంటూ వృద్ధుడిని నమ్కించి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కాజేసిన ఘరానా తాంత్రికుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన తాహిన్ అనే నిందితుడు కృష్ణ పండిట్గా చలామణి అవుతూ ఈ మోసానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. పూజా కార్యక్రమాల పేరుతో వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశించి నగదుతో పాటు పదిహేను లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.