సూర్యాపేట జిల్లా గరిడేపల్లి చెరువుల్లో నీటి కుక్కల సందడి
రిపోర్టర్: సతీష్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని తాళ్లచెరువులో శుక్రవారం నీటి కుక్కలు సందడి చేశాయి. చెరువులో నీటిపై వేగంగా ఈదుతూ, అప్పుడప్పుడు ఒడ్డుకు వచ్చి సంచరిస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో కనిపించే ఈ వన్యప్రాణులు, తాళ్లచెరువుతో పాటు రావిచెరువు, పొనుగోడు చెరువుల్లోనూ కనిపిస్తున్నాయని చెరువు చైర్మన్ చామకూరి దశరథ్ తెలిపారు. నీటి లభ్యత, ఆహారం సమృద్ధిగా ఉండటంతోనే ఇవి ఇక్కడికి వచ్చాయని, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.