ఢీ షో విన్నర్ రాజుపై పెళ్లి పేరుతో మోసం కేసు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' విజేత రాజుపై హైదరాబాద్ పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతి వద్ద నుండి రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.