జన్నారంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందు నాయక్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. ఆరు గ్యారెంటీలతో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.