ఈనాడు తప్పుడు వార్తలపై కేటీఆర్ లీగల్ నోటీసులు: క్షమాపణ చెప్పాలని డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad, Telangana

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్పోర్టు జప్తు అంటూ ప్రముఖ పత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రచురించడం అన్యాయమని పేర్కొంటూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. వెంటనే తప్పుడు కథనాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.