'బొబ్బిలి ఫ్లైఓవర్ నాసిరకం.. సీబీఐ విచారణ జరపాలి': కాంగ్రెస్ డిమాండ్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో రూ.26 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభమైన పదేళ్లకే గుంతలమయమై ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మెటీరియల్ వాడకం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రజాధనం వృధా అయిందని మండిపడ్డారు. దీనిపై ఏసీబీ, సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్లాడ వెంకటరమణ, జిల్లా కార్యదర్శి మండపాక శ్రీనివాసరావు పాల్గొన్నారు.