సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన షెడ్యూల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాలలో సెప్టెంబర్ 27, 28 తేదీలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా నేరేడుచర్ల, హుజూర్ నగర్ ప్రాంతాలలో నూతన రేషన్ కార్డుల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. సుమారు రూ.1.80 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయం వెల్లడించింది.