చిన్నారులకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమన్న సూపర్వైజర్ ఆదినారాయణమ్మ
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని సూరాయపాళెం ఎస్టీ అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీడీపీవో వి.విజయలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సీహెచ్.ఆదినారాయణమ్మ పర్యవేక్షణలో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం వేడి భోజనం అందిస్తున్నట్లు తల్లులకు వివరించారు. గుడ్లు, పాలు, పౌష్టికాహారంపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సీహెచ్.శిరీష, ఎండీహెచ్పీ బి.భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.