కర్నూలు జిల్లాలో పోలీసుల ఘనత: ఐదు వందల ఎనభై తొమ్మిది మొబైల్ ఫోన్లు రికవరీ
రిపోర్టర్: సునీల్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఆరవ మొబైల్ మేళా ద్వారా మొత్తం ఐదు వందల ఎనభై తొమ్మిది పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారని Kurnool Police వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ స్వయంగా బాధితులకు వారి ఫోన్లను అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన సైబర్ క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి దక్కడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.