క్యాన్సర్ బారిన పడిన చిన్నారికి అండగా నిలిచిన స్టార్ ఫుట్బాల్ ఆటగాడు

రిపోర్టర్: సతీష్ స్థలం: Portugal

అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న ఏడేళ్ల చిన్నారి టోమాస్ వైద్య చికిత్స కోసం ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, ఆయన భాగస్వామి జార్ా రోడ్రిగ్జ్ ఆర్థిక సాయం అందించారని నివేదికలు వెల్లడించాయి. క్యాన్సర్ తిరగబెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాలుడి కుటుంబానికి అండగా నిలిచామని జార్జిన రొడ్రిగ్జ్ సోదరి ఇవానా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రొనాల్డో గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.