మా భూములు గుంజుకుంటే బతుకులు ఆగం కావాల్సిందేనా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Erravelli

భూములు లాక్కుని మళ్లీ దళితులకే ఇస్తామనడం ఏంటని ఎర్రవెల్లి దళిత రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే దళితుల ప్రభుత్వమని చెబుతూ తమ వద్ద ఉన్న భూములు గుంజుకుంటే బతుకులు ఆగమవుతాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందాలి కానీ ఉన్న భూమి లాక్కుంటే ఎలాగని ఎర్రవెల్లి రైతు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.