యాదవుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఇందు గార్డెన్స్ ప్రాంగణంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బండి సదానందం అధ్యక్షత వహించగా, 18 మండలాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. యాదవులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని, కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.