ప్రజాసేవా దీక్షతో సేవా సంకల్పానికి సమాయత్తమైన కమల దళం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్లు

ఆమనగల్లు మున్సిపాలిటీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని బీజేపీ శ్రేణులకు పలు సూచనలు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమనగల్లు మున్సిపాలిటీ, రూరల్ నాయకులకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.