కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ధ్వజం: రాష్ట్రానికి శాపంగా మారిన కరువు
రిపోర్టర్: సతీష్
స్థలం: వనపర్తి
కాంగ్రెస్ చేసిన పాపం తెలంగాణకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి సభలో ఆయన మాట్లాడుతూ, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు అని మండిపడ్డారు. కృష్ణా నీటిని మళ్లించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు భరోసా కల్పిస్తే, నేడు రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.