జగన్నాథ రూపంలో దర్శనమిస్తున్న పలాస లేబర్ కాలనీ వినాయకుడు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస లేబర్ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా జగన్నాథ స్వామి రూపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నారు.