యువతకు పారదర్శకంగా పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న బండి సంజయ్
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi / India
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన రోజ్ గార్ మేళా ద్వారా ఎటువంటి పైరవీలు, అవినీతి, పేపర్ లీకేజీలకు తావులేకుండా ఇప్పటివరకు 12 లక్షల 75 వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 20వ విడత రోజ్ గార్ మేళా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.