సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించిన నటి రష్మిక మందన్న
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
తనపై వస్తున్న ఆన్లైన్ ట్రోలింగ్ మరియు విమర్శలపై ప్రముఖ నటి రష్మిక మందన్న స్పందించారు. ఎవరి కోసమో తాను నటించలేనని, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోబోనని ఆమె తేల్చిచెప్పారు. కీర్తితో జరిగిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో రష్మిక ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నెగెటివిటీ పెరిగిపోతున్న తరుణంలో తాను సానుకూలతను పంచడానికే ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఇతరులను సంతోషపెట్టడం కోసం నటిస్తూ జీవించలేనని, తన సహజ స్వభావంతోనే సంతోషంగా ఉన్నానని రష్మిక స్పష్టం చేశారు.