నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నవంబర్ పదిహేనే న కేఏఎస్ ప్రిలిమ్స్ పరీక్ష
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కర్ణాటక
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేఏఎస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించిందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసిన నోటీసు ప్రకారం నవంబర్ పదిహేనే న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం మూడు వందల పంతొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్ ఏ కింద నూట పదిహేడు, గ్రూప్ బి కింద రెండు వందల రెండు ఖాళీలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.