శాంతిఖని గనిలో కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ వినతిపత్రం అందజేత

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో గని సమస్యలపై మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు మెమోరాండం అందజేశారు. బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేశ్ మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.