పౌల్ట్రీ రంగం కీలక నిర్ణయం: లైవ్ చికెన్ కిలో రూ.110 ధర స్థిరీకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శంషాబాద్

కోళ్ల పెంపకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా పౌల్ట్రీ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. శంషాబాద్ లో సమావేశమైన సంఘాల ప్రతినిధులు లైవ్ చికెన్ కిలోకు కనీసం నూట పది రూపాయల ధరను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. మేత ఖర్చుల భారం, మొక్కజొన్న ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఏఐపీబీఏ చైర్మన్ బహదూర అలీ తెలిపారు.