మహాత్మా గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: శివశంకర్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

మహాత్మా గాంధీజీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో స్వర్ణ నంది అవార్డు గ్రహీత శివశంకర్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అహింస, నిజాయితీ, నిబద్ధత వంటి వారి ఆశయాలు దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. యువత డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉంటూ హింసలేని సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.