విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రధాని జన్మదిన వేడుకలు
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీరారెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.