సేవాభావంతోనే దేశంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్న ప్రధాని మోదీ
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, సూర్యఘర్ వంటి మహోన్నత పథకాలు సాధ్యమవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరాలను పంచుకున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందడంలో సేవాభావమే కీలకమైన చోదక శక్తిగా నిలుస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.