రూ.7.75 కోట్లతో ఐదు నూతన అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభించిన మంత్రి
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి వర్చువల్ విధానంలో మరో నాలుగు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.