ఓటీటీకి దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్: స్ట్రీమింగ్ ఎప్పుడంటే
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ఐ యామ్ గేమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్ లో నవంబర్ 6 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.