కోటి గాజులతో వికసించిన గాజువాక గణనాధుడి దివ్య రూపం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

ప్రతీ సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో భారీ గణేశుని విగ్రహాన్ని అత్యంత వైభవంగా విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కొన్ని అవాంతరాల కారణంగా శ్రీనగర్ డి మార్ట్ పక్కన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కోటి గాజులను ఉపయోగించి అతి సుందరంగా స్వామివారిని తయారు చేశారు. ఈ రోజు తొలిసారిగా స్వామివారి ముఖాన్ని ఆవిష్కరించి భక్తులు ఘనంగా తొలి పూజలు నిర్వహించారు.