విశాఖలో సీఎం బహిరంగ సభకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

రిపోర్టర్: సతీష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 19న ముఖ్యమంత్రి పర్యటన మరియు పట్టాల పంపిణీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లు, పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని అధికారులు కోరారు.