సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి.

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు సంస్థలు కీలక పురోగతి సాధించాయి. మహబూబ్‌నగర్‌లోని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో దాచి ఉంచిన తుపాకులు, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ అధికారుల సహకారంతోనే ఈ భారీ చోరీ జరిగినట్లు తేలడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.