కింగ్ 100 సినిమా: మహానతి ఝాన్సీరాణి పాత్రలో టబు గ్లింప్స్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతిష్టాత్మక వందవ చిత్రంలో ప్రముఖ నటి టబు పుట్టినరోజు సందర్భంగా మహానతి ఝాన్సీరాణి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, టబు పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.