ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

రిపోర్టర్: సతీష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నాగులవంచలో బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.