అయోధ్యలో వెంకన్న ఆలయ నిర్మాణంపై చంద్రబాబు కీలక ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: అయోధ్య / అమరావతి

అయోధ్యలో రామ మందిర నిర్మాణ కలలను ప్రధాని నరేంద్ర మోదీ నిజం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్రేతాయుగ దైవమైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వెంకన్న ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.