గుంతలమయంగా మారిన బెస్తగూడెం రహదారి ప్రయాణించాలంటేనే నరకం చూస్తున్న జనం
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం రహదారి తీవ్ర అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యం వీడకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.