పోలండ్ సరిహద్దు సమీపంలో రష్యా డ్రోన్ల దాడుల కలకలం
రిపోర్టర్: అశోక్
స్థలం: World
పోలండ్ సరిహద్దుకు అతి సమీపంలో రష్యా డ్రోన్లు దాడి చేయడం యూరప్ దేశాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు. రష్యా మరింత ప్రమాదకరమైన జెట్-పవర్డ్ డ్రోన్లను వాడుతోందని హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా రాత్రికి రాత్రే వందల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడటంతో, పోలండ్ సైన్యాన్ని అప్రమత్తం చేసి యుద్ధ విమానాలను రంగంలోకి దించారు.