మురిమడుగులో జలసిరి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామపంచాయతీలో జలసిరి పథకం కింద జరుగుతున్న ఫారం పాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పనుల ప్రగతిపై చర్చించి పలు వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీల పనిదినాలు పెంచాలని స్థానిక సర్పంచ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శి, స్థానికులు పాల్గొన్నారు.