ప్రేమ వివాహాలపై నిషేధం విధిస్తూ గ్రామ పంచాయతీ వివాదాస్పద నిర్ణయం
రిపోర్టర్: గోపి
స్థలం: హిసార్
హర్యానాలోని హిసార్లో గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ప్రేమ వివాహాలను నిషేధిస్తూ, ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ తప్పదని పంచాయతీ హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పులను ధిక్కరిస్తూ ప్రాథమిక హక్కులను కాలరాసే ఈ నిరంకుశ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతీ యువకుల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ తీర్పును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.