వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ
రిపోర్టర్: సునీల్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ దృష్టి సారించారు. వాడరేవు, రామాపురం బీచ్‌లలోని నిమజ్జన ప్రదేశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని మొత్తం 86 నిమజ్జన కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.