యువకుడిపై మంత్రి దాడి ఘటన: పర్వేష్ వర్మపై జర్నైల్ సింగ్ పరువు నష్టం దావా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

ఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో యువకుడిపై మంత్రి పర్వేష్ వర్మ దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ స్పందిస్తూ మంత్రికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు తెలిపారు. ఏడు రోజుల్లోగా మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.