కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ గౌడ్: పార్టీ బలోపేతానికి చొరవ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధికార ప్రతినిధిగా పీపల్పహాడ్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సర్పంచ్ పూలనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్, స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానని, నాయకుల నమ్మకాన్ని కాపాడుకుంటూ సేవలు అందిస్తానన్నారు.