ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: మోదీ ప్రభుత్వ అధికారులపై సంచలన ఆరోపణలు

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ, సీబీఐతో సహా ప్రభుత్వంలోని దాదాపు రెండు వందల మంది అధికారులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వివాదంపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నాయకులు మార్చ్ నిర్వహించనున్న తరుణంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.