ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో విదేశీ విద్యార్థుల వసతిపై కఠిన నిబంధనలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలో ప్రైవేట్ ఇళ్లు, పీజీలలో ఉంటున్న విదేశీ విద్యార్థులను 30 రోజుల్లోపు కళాశాల హాస్టళ్లకు మార్చాలని కలెక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ మరియు ఎస్పీ శ్వేతా శ్రీవాస్తవ సిన్హా ఆదేశించారు. విదేశీ విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.