హైదరాబాద్ లో విషాదం: లక్ష్మీగూడలో ఎనిమిదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో ఎనిమిదేళ్ల బాలుడు ఇంట్ లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సమయంలో బాలుడి ఐదేళ్ల చెల్లెలు ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికుల దంపతుల కుమారుడైన ఈ బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.